అల వైకుంఠపురములో రివ్యూ

Ala Vaikunthapurramuloo Review Rating

నటీనటులు: అల్లు అర్జున్ , పూజా హెగ్డే , టబు
సంగీతం : ఎస్ ఎస్ తమన్
నిర్మాతలు : అల్లు అరవింద్ , రాధాకృష్ణ
దర్శకత్వం : త్రివిక్రమ్
రేటింగ్ : 3.5 /5
రిలీజ్ డేట్ : 12 జనవరి 2020

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు చిత్రాలు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలు సాధించడంతో మూడో చిత్రంగా వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

మధ్య తరగతి కుటుంబానికి చెందిన బంటు (అల్లు అర్జున్ ) అమూల్య ( పూజా హెగ్డే ) దగ్గర పనికి కుదురుతాడు. సాధారణ కుటుంబానికి చెందిన బంటుకి అమూల్య కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో బంటుకి తెలుస్తుంది దాంతో అల వైకుంఠపురములోకి అడుగు పెడతాడు. అల వైకుంఠపురములోకి అడుగుపెట్టిన బంటు లక్ష్యం నెరవేరిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

అల్లు అర్జున్
పూజా హెగ్డే గ్లామర్
ఎంటర్ టైన్ మెంట్
తమన్ సంగీతం

డ్రా బ్యాక్స్ :

కథ కొత్తగా లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్ కు తగ్గట్లుగానే స్టయిలిష్ లుక్ లో అదరగొట్టాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ తో షేక్ చేసాడు అలాగే ఫైట్స్ కూడా స్టయిలిష్ గా ఉన్నాయి. పూజా హెగ్డే గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇద్దరి జంట బాగుంది అంతకంటే నటనతో ఆకట్టుకున్నారు. టబు కీలక పాత్రలో నటించి మెప్పించింది. నివేదా పేతురాజ్ , సుశాంత్ తదితరులు తమతమ పాత్రలలో మెప్పించారు.

సాంకేతిక వర్గం :

తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ సూపర్ హిట్ పాటలకు అందమైన విజువల్స్ కూడా తోడవడంతో మరింత గ్రాండ్ గా ఉన్నాయి. తమన్ అందించిన అన్ని పాటలు కూడా విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ….. అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. పూజా హెగ్డే అందాలను మరింత అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అద్భుతమైన కట్టడంలా పేర్చాడు అని చెప్పక తప్పదు. ఎవరి నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో బాగా తెలిసిన త్రివిక్రమ్ అందరి నుండి మెరుగైన నటన రాబట్టుకున్నాడు.

ఓవరాల్ గా :

అల వైకుంఠపురములో అందర్నీ మెప్పించే సినిమా.

రివ్యూ అవలోకనం
అల వైకుంఠపురములో రివ్యూ
మునుపటి వ్యాసంతాన్య హోప్ ఫోటోలు
తదుపరి ఆర్టికల్భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి