అశ్వథామ రివ్యూ

ashwathama movie review rating

నటీనటులు : నాగశౌర్య , మెహరీన్
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
నేపథ్య సంగీతం : జిబ్రాన్
నిర్మాత : ఉష మూల్పూరి
దర్శకత్వం : రమణ తేజ
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 31 జనవరి 2020

యంగ్ హీరో నాగశౌర్య కథ అందించడమే కాకుండా హీరోగా నటించిన చిత్రంఅశ్వథామ ”. రమణ తేజ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. మరి చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

గణ ( నాగశౌర్య) కు చెల్లెలు ప్రియా ( సర్గన్ కౌర్ ) అంటే అమితమైన ప్రేమ దాంతో ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే అలాంటి తన చెల్లెలు ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిందని తెలుసుకొని షాక్ అవుతాడు. పెళ్లి చేసుకోవాల్సిన చెల్లి ఎందుకు సూసైడ్ కి ప్రయత్నించింది. పెళ్ళికి ముందే ఆమె ఎలా నెల తప్పింది ? దానికి కారకులు ఎవరు ? అన్న కోణంలో గణ దర్యాప్తు చేస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు తెలుస్తాయి. దాంతో తన చెల్లెలు కు అలాగే తన చెల్లెలు లాంటి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి గణ చేసిన ప్రయత్నం ఏంటి ? చివరకు ఏం జరిగింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

నాగశౌర్య
కథ
యాక్షన్ సీన్స్
నేపథ్య సంగీతం

డ్రా బ్యాక్స్ :

స్లో నేరేషన్
సాగతీత సన్నివేశాలు
క్లైమాక్స్

నటీనటుల ప్రతిభ :

గణ పాత్రలో నాగశౌర్య అద్భుత నటన ప్రదర్శించి సినిమాని తన భుజస్కంధాలపై మోశాడు. యాక్షన్ హీరోగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడు , రాసుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో లవర్ బాయ్ గా కనిపించినప్పటికి తర్వాత ఫుల్ మాస్ లుక్ లో అలరించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టి యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. మెహరీన్ అందంగా ఉంది అలాగే అందంగా నటించింది అంతేకాని ఇంకా నటనలో మెరుగు అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. విలన్ గా నటించిన జిష్ణు సేన్ గుప్త భయపెట్టాడు. పాత్రకు సరైన వ్యక్తి అనిపించాడు. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని , ప్రిన్స్ , సత్య తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం :

అమ్మాయిల కిడ్నాప్ , అత్యాచారాల నేపథ్యంలో మంచి కథని ఎంచుకున్నాడు హీరో నాగశౌర్య. అలాగే కథని తనదైన శక్తిమేరకు బాగానే తెరకెక్కించాడు కొత్త దర్శకుడు రమణ తేజ. అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది. డైలాగ్స్ చాలామేరకు ఆకట్టుకున్నాయి , ఆలోచింప జేసేలా ఉన్నాయి. నాగశౌర్య నమ్మకాన్ని చాలావరకు నిలబెట్టుకున్నాడు రమణ తేజ. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు తెరమీద బాగున్నాయి . ఇక సినిమాకు జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే బాగుండేది.

ఓవరాల్ గా :

ఒకేసారి చూడొచ్చు అశ్వథామని 

రివ్యూ అవలోకనం
అశ్వథామ రివ్యూ
మునుపటి వ్యాసంఎన్టీఆర్ సినిమాలో బాలయ్య ?
తదుపరి ఆర్టికల్ఐశ్వర్య రాజేష్ ఫోటోలు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి