భీష్మ రివ్యూ

bheeshma movie review rating

నటీనటులు : నితిన్ , రష్మిక మందన్న
సంగీతం : స్వరసాగర్
నిర్మాత : నాగవంశీ
దర్శకత్వం : వెంకీ కుడుముల
రేటింగ్ : 3.5/ 5
రిలీజ్ డేట్ : 21 ఫిబ్రవరి 2020

నితిన్రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంభీష్మ ”. టీజర్ , ట్రైలర్ లతో అంచనాలు పెంచేలా చేసిన భీష్మ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

కథ :

భీష్మ ( నితిన్ ) సింగిల్ గా లైఫ్ ని బోర్ గా సాగించే యువకుడు. అయితే అనూహ్యంగా వ్యవసాయంలో మంచి చేయాలనే సేవా సంస్థ  భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు భీష్మ. భీష్మ ఆర్గానికి రైతుల మంచి కోసం ఉపాయాగపడే సంస్థ అయితే అందుకు విరుద్దంగా స్వలాభమే ప్రయోజనంగా భావించే క్రిమినల్ మైండ్ కలిగిన రాఘవన్  (జిష్ణు )తో పోటీ పడతాడు భీష్మ. అయితే అనూహ్యంగా చిక్కుల్లో పడతాడు భీష్మ. దాంతో చిక్కులోంచి ఎలా బయటపడ్డాడు ? ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

నితిన్ యాక్టింగ్
నితిన్రష్మిక మందన్న కెమిస్ట్రీ
విజువల్స్
ఎంటర్ టైన్ మెంట్
వెన్నెల కిషోర్ కామెడీ

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్ సెకండాఫ్ లో

నటీనటుల ప్రతిభ :

భీష్మ పాత్రలో నితిన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! తనదైన కామెడీతో అలరించాడు నితిన్ . ఒకవైపు వెన్నెల కిషోర్ తో అలాగే మరోవైపు రష్మిక మందన్న లతో కలిసి కామెడీ చేయడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అదరగొట్టాడు. నితిన్రష్మిక మందన్న కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత నితిన్ నుండి అభిమానులు కోరుకున్న సినిమాని అందించాడు. రష్మిక మందన్న గ్లామర్ , నటన సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. గ్లామర్ తో ఆకట్టుకున్న భామ నితిన్ తో కూడా కలిసిపోయి అద్భుత నటన ప్రదర్శించి మెప్పించింది. నితిన్ , రష్మిక తర్వాత వెన్నెల కిషోర్ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచాడు. అతడి ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేముంది. వెన్నెల కిషోర్ మ్యాజిక్ చేసాడు తన పాత్రతో. జిష్ణు కూడా ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో రాణించారు.

సాంకేతిక వర్గం :

ఛలో తో దర్శకుడిగా సత్తా చాటిన వెంకీ కుడుముల రెండో ప్రయత్నాన్ని అంతకు మించిన ప్రయోగమే చేసాడు. తనకు పట్టు ఉన్న కామెడీని అస్త్రంగా చేసుకొని సింపుల్ కథకు చక్కని సందేశాన్ని జోడించి సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మలిచాడు. నటీనటుల నుండి తనకు రావాల్సిన నటనని రాబట్టుకొని సూపర్ హిట్ గా మలిచాడు భీష్మని. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు స్వరసాగర్ చిత్రానికి మంచి పాటలు అందించి మంచి హిట్ కొట్టాడు. శ్రీరామ్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. నాగవంశీ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా భారీ చిత్రాన్ని నిర్మించాడు.

ఓవరాల్ గా :

భీష్మ అందరికీ నచ్చే సినిమా

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి