కరోనా ఎఫెక్ట్ : కేసీఆర్ ప్రభుత్వానికి 500 కోట్ల విరాళం

Corona Effect: 500 cr donation to KCR government

కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన  శాసన సభ్యులు , శాసన మండలి సభ్యులు , పార్లమెంట్ సభ్యులు ఒక నెల జీతంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు దాంతో మొత్తంగా 500 కోట్లు కేసీఆర్ ప్రభుత్వానికి విరాళంగా వస్తోంది. పెద్ద మొత్తంలో విరాళాలు వస్తుండటంతో కరోనా ని ఎదుర్కోవడానికి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ ఎం ఎల్ లు, ఎం ఎల్ సి లు , పార్లమెంట్ సభ్యులు స్పందించిన విధానం బాగుందని, ఈవిపత్కర సమయంలో పెద్ద మొత్తంలో విరాళం అందించడానికి ముందుకు వచ్చినందుకు వాళ్లందరికీ కృతఙ్ఞతలు తెలిపాడు కేసీఆర్. రాజకీయ నాయకులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి విరాళాలు ఇస్తున్నారు పెద్ద మొత్తంలోనే. ఇప్పటికే కొంతమంది హీరోలు విరాళాలు ప్రకటించగా మరికొంతమంది కూడా అదే బాటలో పయనించేలా ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి