దర్బార్ రివ్యూ

darbar movie review rating

నటీనటులు : రజనీకాంత్ , నయనతార , నివేదా థామస్
సంగీతం : అనిరుద్
నిర్మాత : సుభాస్కరన్
దర్శకత్వం : ఆర్ మురుగదాస్
రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 9 జనవరి 2020

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్. నయనతార , సునీల్ శెట్టి , నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. మరి దర్బార్ ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

ఆదిత్య అరుణాచలం ( రజనీకాంత్ ) ముంబై కమీషనర్ గా వస్తాడు. గాడి తప్పిన ముంబైని దారిలో పెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు దాంతో ఆదిత్య అరుణాచలంతో  వైరం ఏర్పడుతుంది గ్యాంగ్ స్టర్ హరి చోప్రా ( సునీల్ శెట్టి )తో. ఆదిత్య అరుణాచలం కూతురు వల్లీ ( నివేదా థామస్ ) కు తీరని అన్యాయం జరుగుతుంది దాంతో ఆదిత్య అరుణాచలం రివేంజ్ తీర్చుకోవడానికి హరి చోప్రా గ్యాంగ్ ని టార్గెట్ చేస్తాడు. అసలు ఆదిత్య అరుణాచలంకు హరి చోప్రాకు మధ్యనున్న వైరం ఏంటి ? వల్లీ కి జరిగిన అన్యాయం ఏంటి ? దాన్ని ఎలా బదులు తీర్చుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

రజనీకాంత్
రీ రికార్డింగ్
యాక్షన్ సీన్స్
నివేదా థామస్

డ్రా బ్యాక్స్ :

కథ
కథనం

నటీనటుల ప్రతిభ :

ఆదిత్య అరుణాచలం పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ అదరగొట్టేసాడు. 70 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫైట్స్ చేయడమే కాకుండా యాక్షన్ సీన్స్ లో వీర లెవల్లో రెచ్చిపోయాడు. రజనీకాంత్ అభిమానులు చాలాకాలంగా కోరుకుంటున్న అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా దర్బార్ అనే చెప్పాలి. తన స్టైల్ తో మేనరిజమ్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. నయనతార ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక నివేదా థామస్ కు మంచి పాత్ర లభించింది దాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. విలన్ గా సునీల్ శెట్టి బాగా నటించాడు. యోగిబాబు కామెడీ తో అలరించాడు.

సాంకేతిక వర్గం :

అనిరుద్ అందించిన పాటలు విజువల్ గా చాలా బాగున్నాయి. అలాగే నేపథ్య సంగీతంతో కూడా అలరించాడు అనిరుద్. విజువల్స్ చాలా బాగున్నాయి. రజనీకాంత్ ని 70 ఏళ్ల వయసులో కూడా యువకుడిగా చూపించి భేష్ అనిపించాడు ఛాయాగ్రాహకులు సంతోష్ శివన్. నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు మురుగదాస్ విషయానికి వస్తే …. కథ , కథనం పెద్దగా లేకపోయినా రజనీకాంత్ ని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి మార్కులు కొట్టేసాడు. అయితే కథలో కానీ సెకండాఫ్ లో కానీ ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే తప్పకుండా ఇంకా పెద్ద హిట్ అయ్యేది.

ఓవరాల్ గా :

ఫ్యాన్స్ ని అలరించే రజనీ  దర్బార్

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి