జనతా కర్ఫ్యూ కొనసాగించనున్నారా ?

KCR Will the Janata curfew continue

కరోనా వైరస్ నేపథ్యంలో ఈరోజు ఒక్కరోజు మాత్రమే జనతా కర్ఫ్యూ నిర్వహించాలని అనుకున్నారు కానీ తెలంగాణాలో క్షణ క్షణానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో ఈనెల 31 వరకు జనతా కర్ఫ్యూ ని పొడిగించే ఆలోచన చేస్తున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కొద్దిసేపట్లోనే అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశం అవుతున్నారు కేసీఆర్. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొనున్నాయని తెలుస్తోంది.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈనెల 31 వరకు కూడా అన్ని రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. అయితే ప్యాసింజర్ రైళ్లు మాత్రం తిరగవు కానీ గూడ్స్ రైళ్లు మాత్రం ప్రయాణిస్థాయని తెలిపారు. దాంతో తెలంగాణలో కూడా జనతా కర్ఫ్యూ ని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడట కేసీఆర్. అయితే దీనివల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఇవ్వాలని అనుకుంటున్నాడట కేసీఆర్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి