మత్తు వదలరా రివ్యూ

mathu vadalara movie review

మత్తు వదలరా రివ్యూ
నటీనటులు : శ్రీ సింహా , సత్య , వెన్నెల కిషోర్
సంగీతం : కాలభైరవ
నిర్మాతలు : చిరంజీవి , హేమలత
దర్శకత్వం : రితేష్ రానా
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 25 డిసెంబర్ 2019

ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన చిత్రం మత్తు వదలరా. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. మరి సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

కథ :

బాబూమోహన్ ( శ్రీ సింహా ) ఏసుదాస్ ( సత్య ) అభి ( అగస్త్య ) లు చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతూ ఒకే రూములో ఉంటుంటారు. అయితే ఇబ్బందులనుండి బయట పడాలని చూస్తున్న సమయంలో ఏసుదాస్ బాబూమోహన్ కు సలహా ఇస్తాడు. అయితే సలహా వల్ల బాబూమోహన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. కేసు నుండి బయట పడటానికి బాబూమోహన్ తన స్నేహితులతో కలిసి ఏం చేసాడు ? చివరకు ఆహత్య కేసుని చేధించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

శ్రీ సింహా నటన
సత్య కామెడీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
నేపథ్య సంగీతం

డ్రా బ్యాక్స్ :

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

రాజమౌళికీరవాణి కుటుంబం నుండి వచ్చిన శ్రీ సింహా హీరోగా అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. కీరవాణి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే తప్పకుండా అందరి చూపు శ్రీ సింహా నటన మీద ఉంటుంది, పైగా విమర్శలు చేయడానికి కొంతమంది పనిగట్టుకొని మరీ చూస్తుంటారు అయితే అలాంటి వాళ్లకు ఆస్కారం ఇవ్వకుండా తన పెద్దవాళ్లకు మరింత గౌరవం తీసుకు వచ్చేలా నటించి మెప్పించాడు శ్రీ సింహా. మొదటి సినిమాలోనే తన ప్రతిభ ఏంటో చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు శ్రీ సింహా. ఇక సినిమాకు సత్య క్యారెక్టర్ హైలెట్ అనే చెప్పాలి. సత్య కామెడీతో అలరించాడు. వెన్నెల కిషోర్ షాకింగ్ పాత్రని పోషించి భేష్ అనిపించాడు.  ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం :

ఇక విభాగంలో కూడా కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ తనదైన ముద్ర వేసాడు. తమ్ముడు హీరోగా అద్భుతంగా నటిస్తే అతడికి మించి నేపథ్య సంగీతం తో అలరించాడు కాలభైరవ. పాటలతోనే కాకుండా రీ రికార్డింగ్ తో కూడా సినిమాకు ఆయువు పట్టుగా నిలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు కాలభైరవ. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు రితేష్ విషయానికి వస్తే ……. కథ ఏమనుకున్నాడో దాన్ని మించి బయటకు పోకుండా చక్కని స్క్రీన్ ప్లే రూపొందించుకొని నటీనటుల నుండి సాంకేతిక నిపుణుల నుండి తనకు రావాల్సిన దాన్ని రాబట్టుకొని అద్భుతమైన చిత్రంగా మలిచాడు.

ఓవరాల్ గా :

తప్పకుండా చూడాల్సిన చిత్రం…..  మత్తు వదలరా

 

రివ్యూ అవలోకనం
మత్తు వదలరా రివ్యూ
మునుపటి వ్యాసంహిట్టు కొట్టిన కీరవాణి తనయులు
తదుపరి ఆర్టికల్మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి క్రిస్మస్ వేడుకలు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి