కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ రెడ్డి

Revant Reddy welcomes KCR decision

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కి అస్సలు నచ్చదు ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అలాంటిది కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు రేవంత్ రెడ్డి. సంచలనం కలిగించే ఈ విషయం ఏంటో తెలుసా …… కరోనా ఎఫెక్ట్ తో యావత్ దేశం అల్లల్లాడి పోతోంది. కరోనా ని నిలువరించే క్రమంలో కేసీఆర్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.

అంతేకాదు జనాలు ఇంట్లో బయటకు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్లకు 1500 రూపాయలతో పాటుగా ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాంతో అతడి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే పనిలో పనిగా జైలులో ఉన్న ఖైదీలను కూడా కొంతకాలం విడిచి పెడితే బాగుంటుందని ఎందుకంటే కరోనా వైరస్ బారిన పడేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని కొంతకాలం విడుదల చేయండి అంటూ కేసీఆర్ కు మొరపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇటీవలే చర్లపల్లి జైలు కెళ్ళి వచ్చాడు రేవంత్ రెడ్డి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి