రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నాడా ?

Revanth Reddy to form new political party

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఒంటి కాలు మీద లేస్తున్న రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులనుండి తగిన స్థాయిలో మద్దతు లభించడం లేదు సరికదా ! తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అంతేకాదు పిసిసి రేసులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ అతడికి పిసిసి పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

దాంతో ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగి లాభం లేదని కేసీఆర్ ని కేటీఆర్ ని ఎదుర్కోవాలంటే సొంత పార్టీ పెట్టడమే ఏకైక మార్గం అంటూ రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడట. కేసీఆర్ ని ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు కానీ తన లక్ష్యం కేసీఆర్ ని గద్దె దించడం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒంటరి పోరాటం చేయడం కంటే సొంత పార్టీ పెట్టి తన మద్దతు దారులతో పోరాటం చేయడమే మంచిదని భావిస్తున్నాడట. అయితే కొత్త పార్టీ పెట్టడం , దాన్ని నడిపించడం అంటే మాటలు కాదు కదా అందుకే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దాని మీద ఆలోచన చేస్తున్నాడట రేవంత్ రెడ్డి

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి