సరిలేరు నీకెవ్వరు రివ్యూ

Sarileru Neekevvaru review and rating

నటీనటులు : మహేష్ బాబు , రష్మిక మందన్న , విజయశాంతి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : మహేష్ బాబు , దిల్ రాజు , అనిల్ సుంకర
దర్శకత్వం : అనిల్ రావిపూడి
రేటింగ్ : 3. 5/5
విడుదల తేదీ : 11 జనవరి 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో విడుదలైన చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

మేజర్ అజయ్ కృష్ణ ( మహేష్ బాబు ) కిడ్నాప్ చేయబడిన స్టూడెంట్స్ ని రక్షించడానికి తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు . ఉగ్రవాదులను అంతం చేసిన మేజర్ అజయ్ కృష్ణ అనుకోని పరిస్థితుల్లో కర్నూల్ కు వెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ లో ప్రొఫేసర్ గా పనిచేస్తున్న భారతి ( విజయశాంతి ) ని కలిసిన తర్వాత ఆమెతో పాటుగా ఆమె కుటుంబం మంత్రి నాగేంద్ర కుమార్ ( ప్రకాష్ రాజ్ ) వల్ల ప్రమాదం ఉందని గ్రహిస్తాడు. ప్రమాదంలో ఉన్న భారతి కుటుంబాన్ని మేజర్ అజయ్ కృష్ణ  ఎలా కాపాడాడు ? అసలు మంత్రి నాగేంద్ర కుమార్ కు భారతి కుటుంబానికి వైరం ఎలా ఏడ్పడింది ? వీళ్లకు మేజర్ కు సంబంధం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

మహేష్ బాబు
విజయశాంతి
ప్రకాష్ రాజ్
ఎంటర్ టైన్ మెంట్
యాక్షన్ సీన్స్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సీన్స్
నిడివి

నటీనటుల ప్రతిభ :

మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో సరికొత్త మహేష్ ని చూడటం ఖాయం. అలాగే మంచి కామెడీ టైమింగ్ తో అలరించాడు మహేష్. సైనికుడి గెటప్ లో కానీ కర్నూల్ లో యాక్షన్ సీన్స్ కానీ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇక సెంటిమెంట్ సీన్స్ లో కూడా విజయశాంతి తో కలిసి అద్భుత నటన ప్రదర్శించాడు మహేష్. ఇక విజయశాంతి చాలాకాలం తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకుంది. ప్రొఫేసర్ భారతి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నిజంగానే సూపర్ స్టార్ అనిపించింది. నటనకు ఇన్నాళ్లు దూరం అయినప్పటికీ అదే వేడి అదే వాడి చూపించింది. సినిమాకు కీలక పాత్ర కూడా కావడంతో తనదైన ముద్ర వేసింది. విలన్ గా ప్రకాష్ రాజ్ మరోసారి సత్తా చాటాడు. ఇక బ్లేడ్ గ్యాంగ్ తో బండ్ల గణేష్ నవ్వులు పూయించాడు. తమన్నా ఐటెం సాంగ్ తో మెప్పించింది. రష్మిక మందన్న అందంగా ఉంది అలాగే అంతకంటే అందంగా నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో సంగీత , రాజేంద్రప్రసాద్ , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు , రావు రమేష్ తదితరులు తమతమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం :

రత్నవేలు సినిమాటోగ్రఫీ , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పోటీ పడి మరీ హైలెట్ గా నిలిచాయి సినిమాకు. రత్నవేలు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు విజువల్ గా చాలా బాగున్నాయి ఇక రీ రికార్డింగ్ తో మరో లెవల్ కి తీసుకెళ్లాడు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని. అయితే సెకండాఫ్ లో కాస్త స్లో అయ్యినట్లనిపించింది కాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండేదేమో! ఇక నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది భారీ తారాగణం తో భారీ బడ్జెట్ టిప్ తెరకెక్కించారు. దర్శకుడు అనిల్ విషయానికి వస్తే ……. మహేష్ బాబు ని ఎలాగైతే అభిమానులు చూడాలని అనుకుంటున్నారో ఆలా చూపించి వందకు వంద మార్కులు కొట్టేసాడు. కథ అంటూ పెద్దగా ఏమి లేదు కానీ ఉన్న కథని సరైన స్క్రీన్ ప్లే జోడించి బాగా ఆకట్టుకున్నాడు.

ఓవరాల్ గా :

నిజంగానే బొమ్మ దద్దరిల్లిపోయింది

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి