కరోనా ఎఫెక్ట్ : గృహ నిర్భందంలో శృతి హాసన్

Shruti Haasan Lockdown 14days

కరోనా ఎఫెక్ట్ శృతి హాసన్ ని కూడా తాకింది దాంతో 14 రోజుల పాటు గృహ నిర్బంధం విధించుకుంది. కొద్దీ రోజుల క్రితం లండన్ వెళ్ళొచ్చింది అందాల భామ శృతి హాసన్. పది రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చింది , అసలే కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి దాంతో తనకు తాను సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంది శృతి హాసన్. కరోనా టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది అయినప్పటికీ 14 రోజుల పాటు గృహ నిర్బంధంలోనే ఉండాలని తీర్మానించుకుంది.

ఎందుకంటే కరోనా 14 రోజుల్లోపు ఎప్పుడైనా తిరగబెట్టొచ్చు అందుకే నిర్ణయానికి వచ్చింది శృతి హాసన్. భామ ఒక్కతే తన ఇంట్లో ఉంటోందట. ఇక మిగతా వాళ్ళు అదే నాన్న కమల్ హాసన్ మరో ఇంట్లో ఉంటున్నాడట అలాగే చెల్లి కూడా మరో ఇంట్లో ఉంటోందట. ప్రస్తుతం భామ తెలుగులో రవితేజ హీరోగా రూపొందుతున్న క్రాక్ చిత్రంలో నటిస్తోంది. సినిమా మేలో విడుదల కానుంది.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి