రాజమౌళికి 100 కోట్ల రెమ్యునరేషన్ ?

SS Rajamouli gets 100 cr remuneration for RRR Movie

ఓటమి ఎరుగని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఒక్క దక్షిణాదిన మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానే తెలుగు సినిమాకు ఖ్యాతిని ఆర్జించిపెట్టిన వ్యక్తి కావడంతో ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు దాంతో దర్శకుడు తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గాను 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక తెలుగు సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ అంటే కష్టం కానీ రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తం అయ్యింది పైగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 భాషలలో విడుదల అవుతోంది కాబట్టి అవలీలగా 1000 కోట్ల టార్గెట్ తో రంగంలోకి దిగనుంది.

రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తో భారీ ఎత్తున బిజినెస్ జరగడం ఖాయం అందుకే 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట జక్కన్న. ఎన్టీఆర్ , చరణ్ , అజయ్ దేవ్ గన్ తదితరులు నటిస్తున్న చిత్రాన్ని 2021 జనవరి 8 భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక నిన్న విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి