విజయ్ ని టార్గెట్ చేసారా ?

state government central government targeted to vijay

తమిళనాట సూపర్ స్టార్ హోదాలో ఉన్న తిరుగులేని మాస్ హీరో విజయ్ ని బీజేపీ అలాగే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే వరుసగా విజయ్ ఇంటిపై ఆఫీసుపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. విజయ్ తన సినిమాల్లో కేంద్ర ప్రభుత్వం పై అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో అందుకు బదులుగానే దాడులు జరుగుతున్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు విజయ్ అభిమానులు.

విజయ్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు అన్నీ పరిశీలించిన మీదట క్లీన్ చిట్ ఇచ్చారు అయితే క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ మరోసారి ఐటీ దాడులు చేయడంతో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. విజయ్ నిన్న మొన్నటి వరకు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు కానీ తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్రానికి 80 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ! అంటే రజనీకాంత్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో విజయ్ అన్నమాట

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి