వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ

world famous lover movie review rating

నటీనటులు : విజయ్ దేవరకొండ , రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్
సంగీతం : గోపీసుందర్
నిర్మాత : వల్లభ
దర్శకత్వం : క్రాంతి మాధవ్
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2020
రేటింగ్ : 2. 5/ 5

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా నలుగురు అందమైన భామలు రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇజా బెల్ లెయిట్  హీరోయిన్ లుగా నటించారు. ప్రేమికుల కానుకగా ఫిబ్రవరి 14 విడుదలైన చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

శీనయ్య ( విజయ్ దేవరకొండ ) సువర్ణ ( ఐశ్వర్య రాజేష్ ) ని పెళ్లి చేసుకుంటాడు. ఇక అదే సమయంలో గౌతమ్ ( విజయ్ దేవరకొండ ) యామిని ( రాశి ఖన్నా ) ప్రేమించుకుంటారు. సాధారణ మధ్య తరగతికి చెందిన శీనయ్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. అతడి జీవితంలోకి వచ్చిన మహిళలు ఎవరు ? అసలు శీనయ్య , గౌతమ్ ఇద్దరు కూడా ఒక్కరేనా ? లేక వేరు వేరా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

విజయ్ దేవరకొండ క్యారెక్టర్
ఐశ్వర్య రాజేష్ నటన
రాశి ఖన్నా గ్లామర్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్

నటీనటుల ప్రతిభ :

విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లో విభిన్న షేడ్స్ ఉన్నాయి వాటిని తనదైన శైలిలో పోషించి మెప్పించాడు. లవర్ బాయ్ గా , భర్తగా , ప్లే బాయ్ గా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన అభిమానులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ , ఐశ్వర్య రాజేష్ నటన , రాశి ఖన్నా గ్లామర్ ఎస్సెట్ గా నిలిచాయి. రాశి ఖన్నా అయితే కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ షాక్ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ మధ్యతరగతి యువతిగా అద్భుత అభినయం ప్రదర్శించింది. ఇక కేథరిన్ , ఇజా బెల్ లు గ్లామర్ కోసం పనికొచ్చారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు క్రాంతి మాధవ్ చిత్రాన్ని సరైన దిశలో నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. మంచి కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ , సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో వైఫల్యం చెందాడు అలాగే ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీసుందర్ అందించిన పాటలు సినిమాలో బాగానే ఉన్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు. విజువల్స్ బాగున్నాయి.

ఓవరాల్ గా :

రౌడీ ఫ్యాన్స్ కు మాత్రమే వరల్డ్ ఫేమస్ లవర్

రివ్యూ అవలోకనం
వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ
మునుపటి వ్యాసంవరల్డ్ ఫేమస్ లవర్ కూడా ప్లాపేనా ?
తదుపరి ఆర్టికల్భీష్మా మూవీ సింగిల్స్ అంతెం వీడియో సాంగ్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి